అంబేద్కర్ ఆశయ సాధన కోసంపునరంకితమవ్వాలని ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడిలో రామకృష్ణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డా. బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామిమాట్లాడుతూ ….రాజకీయవేత్తగా సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు అంబేద్కరని, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కరన్నారు. అంబేడ్కర్ గారికి నిజమైన నివాళి ఆయన ఆలోచనలను ఆచరించడమేనన్నారు.
కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధము లేకుండా ప్రతి ఒక్కరికి రాజ్యంగ ఫలాలు అందుతున్నాయి అంటే అది ఆయన చలవేనన్నారు. ఈ సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేసిన రామకృష్ణ కమిటీని మంత్రి అభినందించారు.

