ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణ పతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని తొలి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి దీపా దాసమున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణ నాథుడికి భారీ గజమాల సమర్పిం చారు. పూజ అనంతరం మాట్లాడిన సీఎం.. దేశంలోనే ఖైరతాబాద్ గణే శుడికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇంత పెద్ద ఉత్సవాలను నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీకి ప్రత్యేకంగా అధినం దిస్తున్నానన్నారు. తెలంగాణలో గణపతి మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. అకాల వర్గాలతో పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించిందని అందరి పూజలతో గణపతి ఆశీస్సులతో వరదల నుంచి బయటపడగలిగామన్నారు. గతేడాది పార్టీ అధ్యక్షుడిగా వచ్చానని, ఈసారి సీఎం హోదాలో వచ్చానన్నారు. ప్రతీ ఏటా ఉత్సవ కమిటీ ఎప్పుడు ఆహ్వానించినా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నానని గుర్తు చేశారు. కాగా, ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు ‘సప్తముఖ మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమై 70 ఏళ్ళు అవుతున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో రూపొందించారు.
