ఘనంగా భక్తి శ్రర్థలతో వినాయక చవితి వేడుకలు- రెండవ రోజు కొనసాగిన వేడుకలు- విగ్రహా కమిటి ఏర్పాట్లను పరిశీలించి తగిన సూచనలు చేసిన పోలీసులు

వినాయక చవితి పండుగ వేడుకలను దర్శి నియోజక వర్గంలో భక్తి శ్రర్థలతో ఘనంగా నిర్వహించారు. దర్శి నియోజక వర్గ వ్యాప్తంగా అధిక సంఖ్యలో విగ్రహా కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా గణనాథుని విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా విగ్రహాల వద్ద శాస్త్రయుక్తంగా రెండవ రోజు వేడుకలు కొనసాగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ఆయా విగ్రహాలను సందర్శించి ప్రత్యేక సూచనలు చేసారు. జై బోలో గణేష్ మహారాజ్ కు అంటూ ఆయా భక్తుల నినాదాలతో ఆయా విగ్రహాల వద్ద ప్రత్యేక భజనలు, పూజలతో మార్మోగుతున్నాయి. పలు చోట్ల విగ్రహా కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *