ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయంపై గుజరాత్ రాష్ట్రానికి చెందిన 20 మంది బృందం ప్రత్యేక అధ్యయనం, పరిశీలన చేయటానికి సోమవారం జిల్లాకు వచ్చారు. ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రాజెక్టు మెనేజర్ సుభాషిణి ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వారికి ఆహ్వానించారు. డీపీఎం సుభాషిణి కార్యాలయంలో జిల్లాలో ప్రకృతి వ్యవసాయం లక్ష్యాలు, ప్రగతి కార్యక్రమాలు గురించి తెలిపారు. అనంతరం కొత్తపట్నం మండలం గమల్ల పాలెం గ్రామంలో బలగాని బ్రహ్మయ్య ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన డ్రాగెన్ ఫ్రూట్స్ ను పరిశీలించారు. కొత్తపట్నంనలో మల్లేశ్వరమ్మ ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రంలో సార్వత్రిక సూత్రాల చక్రములను సందర్శించారు. బీజా మృతం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, విత్తన గుళికలు, అగ్నిస్త్రం, చేప, బెల్లం ద్రావణం డెమో చెప్పారు. జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాసరావు, ప్రకృతి వ్యవసాయ హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎవో మోహన్ రెడ్డి, జిల్లా మండల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.


