శివ రామపురం ప్రాధమిక పాఠశాల (ఎఎ) విద్యార్థులు వరద బాధితుల సహాయార్థం చిరు సహాయం అందజేసారు. ఉపాధ్యాయులు జగదీశ్వరి, జవాహర్ బాబుల ప్రొత్సాహంతో తల్లిదండ్రుల సహాకారంతో రూ. 15,500 రూపాయలు సేకరించారు. ఈ మొత్తాన్ని ఎంఈఓ లు సుబ్బయ్య, సుధాకర్ రావుల సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపనున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులతో పాటు ఆశ కార్యకర్త సుహాషిణి, డ్వాక్రా మహిళ అనురాధలు విద్యార్థులకు సహాకారం అందించారు.

