తాళ్లూరు మండల తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం విరాళాలు సేకరించారు. మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, మాజీ అధ్యక్షుడు శాగం కొండా రెడ్డి, మైనార్టీ రాష్ట్ర నాయకుడు షేక్ పెద కాలేషా వలి (బడే), టిడిపి యువనాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, రామ కోటి రెడ్డి, పండు, మాజీ సర్పంచి వలి, రమేష్ బాబు, సుబ్బా రావు, నాదేళ్ల శ్రీను, యాతం శ్రీనివాస రెడ్డి, వెంకట రావు, నాగేశ్వర రావు, అదాం, బిజేపి నాయకుడు చందోలు రామారావు తదితరులు పాల్గొని మండల కేంద్రంలో విరాళాలు వసూలు చేసారు. ముందుగా ఎన్టీఆర్ వద్ద నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

