హిందీ భాషను ఉపయోగిస్తూ అధికారులు ఉద్యోగులను చైతన్య పరచడమే ఈ వర్క్ షాప్ ముఖ్య ఉద్దేశమని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ జనరల్ మేనేజర్, కోఆర్డినేషన్ ఇంచార్జ్ వి.వి రావు అన్నారు. మంగళవారం బేగంపేట విమానాశ్రయంలో ఏ ఏ ఐ ఆధ్వర్యంలో (ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో వివిధ విభాగాల అధికారులు మరియు ఉద్యోగుల కోసం హిందీ వర్క్ షాప్ ను నిర్వహించారు .ఈ వర్క్ షాప్ ను ప్రారంభించిన ఎయిర్ పోర్ట్ జనరల్ మేనేజర్, కోఆర్డినేషన్ ఇంచార్జ్ వి.వి రావు మాట్లాడుతూ అధికార భాషకు సంబంధించిన నిబంధనల అమలులో శాకా ధిపతుల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. ఈ వర్క్ షాప్ తర్వాత శిక్షణ పొందిన అధికారులు తమ రోజువారి కార్యాలయ పనుల్లో హిందీని విరివిగా ఉపయోగిస్తారు అన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు .వర్క్ షాప్ కు ముఖ్యఅతిథిగా హాజరైన భారత ప్రభుత్వ అధికార భాషా విభాగం హిందీ బోధన పథకం డిప్యూటీ డైరెక్టర్ (రిటైర్డ్) కమాలుద్దీన్ ను వి.వి రావు స్వాగతిస్తూ ఈ రంగంలో ఆయన అనుభవం మరియు స్ఫూర్తిదాయకమైన పనితీరు వల్ల ఈ వర్క్ షాప్ కు ఎంతో ప్రయోజనం కలుగుతుంది అన్నారు. కమాలుద్దీన్ మాట్లాడుతూ హిందీ పదజాలంపై వివరించారు .శుక్లా ఉపేంద్ర కుమార్ మాట్లాడుతూ హిందీలో పనిచేయడం ద్వారా ఈ పథకాల నుంచి ప్రయోజనం పొందవచ్చని అన్నారు. హిందీ పక్షోత్సవాల సందర్భంగా నిర్వహించే వివిధ పోటీలను గురించి రీసెర్చ్ జాయింట్ జనరల్ మేనేజర్ అపూర్వ జెన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనికేషన్స్ జాయింట్ జనరల్ మేనేజర్ బి రవిబాబు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జనరల్ మేనేజర్ నీతా సురేష్ వివిధ విభాగాలకు చెందిన 29 మంది అధికారులు పాల్గొని శిక్షణ పొందారు.
