మహారాష్ట్రలోని అమరావతి జిల్లా లోకసభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏఐసిసి పరిశీలకు రాలీగా ఏఐసీసీ సభ్యురాలు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కోట నీలిమ నియమితులయ్యారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల విజయంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ కోట నీలిమ నిబద్దతను దృష్టిలో ఉంచుకొని ఏఐసిసి ఆమెను మహారాష్ట్రలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల పరిశీలకు రాలిగా నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఎంపి కే.సి వేణుగోపాల్ నియామక ఉత్తర్వులు ఇచ్చారు. ఆమె అనుభవం మహారాష్ట్రలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ
విజయవకాశాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు వెంటనే మహారాష్ట్ర పిసిసి అధ్యక్షుని సంప్రదించాలని ఆదేశాలు జారీ చేశారు.
మహారాష్ట్ర అమరావతి జిల్లా లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏఐసీసీ పరిశీలకు రాలీగా డాక్టర్ కోట నీలిమ నియామకంపై విశాల్ సుదాం హర్షం………………
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏఐసిసి పరిశీలకు రాలీగా ఏఐసీసీ సభ్యురాలు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ,సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ కోట నీలిమ నియమితులవడంపై సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశాల్ సుధాం హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఆమె హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా విశాల్ గుర్తు చేశారు. రానున్న మహారాష్ట్ర అమరావతి జిల్లా లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా నీలిమ ఆధ్వర్యంలో విజయం సాధిస్తుందన్న ఆశా భావాన్ని విశాల్ వ్యక్తం చేశారు.

