తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మంగళవారం నగర కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరపల్లి రమేష్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన రమేష్ ముందుగా శాలువా ,బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు ,మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో రాష్ట్రంలో పిసిసి నూతన జవసత్వాలతో దూసుకెళ్తుందని రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో రమేష్ తో పాటు దర్గ కరుణాకర్ మాదిగ తదితరులు ఉన్నారు.
