జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని ఆమ్మవారి ఆలయ హుండీ ఆదాయం బుధవారం లెక్కించారు. ఎప్రియల్ 27 నుండి సెప్టెంబర్ 11 వరకు నాలుగు నెలల పద్నాలుగు రోజులకు గాను రూ.4,80,505లు వచ్చినట్లు ఆయల ఈఓ పి. కార్తిక్ తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొసనా గురు బ్రహ్మం, కొసనా కోటేశ్వ రమ్మ, తిరుమల శెట్టి సత్యవతి, మాచవరపు రమణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
