బంధుత్వాన్ని రాజకీయాలకు ఆపాదించి బంధుత్వంలో ఎవరైనా పొరపాట్లు చేస్తే అవి నాయకులకు అండగట్టటం సరికాదని తాళ్లూరు మండల జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి అన్నారు. కొత్తపాలెంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. తన అల్లుడు నాగార్జున రెడ్డి ట్రాక్టర్ల స్కీముతో రైతుల వద్ద నగదు తీసుకుని కొన్ని ట్రాక్టర్లు ఇప్పించి మరికొన్ని ఆగిన విషయాలలో తన ప్రమేయంపై వచ్చిన ఆరోపణలపై వివరించారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ నాగార్జున రెడ్డి మా మేనల్లుడు అయినంత మాత్రన ఆయన వ్యక్తిగతంగా చేసిన పనులు, వ్యాపారాలతో నాకు సంబంధం లేదని చెప్పారు. పలువురు ఆయనను కలుస్తున్న సందర్భంలో ఎందుకు వస్తున్నారని ప్రశ్నించా కాని ఒక్కరు కూడ నిజం చెప్పలేదని అన్నారు. నాకు కాని తెలిసి ఉన్న పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తానని చెప్పారు. ప్రజా ప్రతినిథినైన జెడ్పీటీసీని అయిన నన్ను ఈ విషయాల లోనికి లాగటం సరికాదని అన్నారు. రాజకీయాల కోసం మానాన్న వెంకట సుబ్బా రెడ్డి గాని, నేను గాని పొలాలు అమ్ముకుని రాజకీయాలు చేసాము కాని ఏ ఒక్కరికి అన్యాయం చెయ్యలేదని అన్నారు. నాకు తెలిసి సంబంధిత నగదు ఎవరైనా ఒక్కరైనా ఇచ్చినామని చెప్పండి అందుకు నేను కట్టుబడి ఉంటానని అన్నారు. అంతేగాని మా అల్లుడైనంత మాత్రనా నాకు సంబంధం లేని వాటి గురించి అపాదించటం తగదని హితవు చెప్పారు. దయ చేసి పత్రికల ప్రతినిథులు తగిన విధంగా ఆలోచించి.. బంధుత్వాలను రాజకీయాలకు, పార్టీలకు ఆపాదించవద్దని విన్నవించారు
