తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పౌష్టికాహార మాసోత్సవాలు గురువారం నిర్వహించారు. మాసోత్సవాలలో
తాళ్లూరు మండల ఎంపీడీవో యుగ కీర్తి
సిడిపిఓ సిహెచ్ భారతి లు ముఖ్య అతిథులుగా పాల్గొని గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల తల్లులు , బాలకిషోరాలు మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని కోరారు. అంగన్వాడీల ద్వారా ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలన్నారు. పాఠశాలలోని బాలబాలికలకు యుక్త వయసులో వచ్చే సమస్యల గురించి వారు తీసుకోవలసిన పౌష్టిక ఆహారాన్ని గురించి వివరించారు. గ్రామంలోని గర్భవతులకు శ్రీమంతం నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు, గ్రామ ఉపసర్పంచి పులి ప్రసాద్ రెడ్డి , ఐసిడిఎస్ సూపర్వైజర్లు జ్యోతి, మరియమ్మ , సుశీల, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ,అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
