జిల్లా స్థాయి యోగాసనా పోటీలు సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం స్థానిక అంజయ్య రోడ్డులోని ఆంధ్రకేసరి విద్యా కేంద్రం నందు ఉదయం 8 గంటలకు ప్రారంభమగునని యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షులు బోయపాటి రవి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రకాశం జిల్లాకు చెందిన స్కూలు విద్యార్ధులు, కాలేజీ స్టూడెంట్ లు, యోగా గురువులు మరియు ట్రైనర్లు ఎవరైనా పాల్గొనవచ్చునని, ఆయా వయసులవారీగా సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, సీనియర్ ఏబీసీలుగా వర్గీకరించడం జరిగిందని, ప్రతి గ్రూపులో ట్రెడిషనల్, ఆర్టిస్టిక్ సోలో, ఆర్టిస్టిక్ పెయిర్, ఆర్టిస్టిక్ గ్రూప్ మరియు రిథమిక్ పెయిర్ లలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. పోటీల్లో గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని, ప్రతి గ్రూపులో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలను ఖరారు చేసి బహుమతులు ఇవ్వడంతో పాటుగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక ప్రశంసా పత్రం అందించడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 7780680121, 9490163312 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో యోగాసనా భారత్ ప్రకాశం జిల్లా శాఖ కార్యదర్శి సోమ సుబ్బారావు, కోశాధికారి వీఎల్వి సుధీర్ కుమార్ లు పాల్గొన్నారు.
