తాళ్లూరు మాజీ ఎంపీపీ కోట రామిరెడ్డి (54) శనివారం మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. యుక్త వయస్సులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడిగా, వైఎస్ ఎంపీపీగా, ఎంపీపీగా సేవలు అందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేసారు. పార్టీ విధేయుడిగా, పార్టీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బా రెడ్డి, భద్రా రెడ్డి, ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిలకు ముఖ్య అనుచరిడిగా ఉన్నారు. ఆయనకు భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, మాజీ ఎంపీపీలు పోశం మధుసూధన రెడ్డి, గోళ్ల పాటి మోషే, తాళ్లూరు మాజీ సర్పంచి ఐ పెద్ది రెడ్డి, వైసీపీ నాయకుడు ఐవీ రెడ్డి, పలు ప్రజా ప్రతినిథులు, నాయకులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
