ఒంగోలు కేశవస్వామి పేటకు చెందిన మిందల లలిత సాయి, విక్రమ్ సింహపురి రైల్లో సోమవారం నెల్లూరు నుంచి ఒంగోలు వచ్చారు. రైల్వే స్టేషన్ వద్ద ఆటో లో ఇంటికి వెళ్లి దిగిపోయినది. ఆటో డ్రైవర్ మేకల ప్రసాద్ ఆటో లో బ్యాగ్ ను చూసి బ్యాగ్ ను టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు అందజేయగా బ్యాగ్ మరచిపోయి మహిళ వివరాలు తెలుసుకొని బ్యాగ్ ను 2 టౌన్ పోలీసులు ఆటో డ్రైవర్ సమక్షంలో మహిళకు అందజేయడం జరిగింది. అందులో ఉన్న బంగారం మహిళ చూసుకొని అని వస్తువులు ఉన్నాయి తెలిపి పోలీసులకు, ఆటో డ్రైవర్ కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా మరచిపోయిన బ్యాగ్ ను అందజేసిన ఆటో డ్రైవర్ ను 2 టౌన్ సీఐ ప్రత్యేకంగా అభినందించారు.సీఐ తో పాటు రైటర్ విప్పర్ల వెంకట్రావు, మహిళా కానిస్టేబుల్ ఉన్నారు.
