ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని పురష్కరించుకుని గురువారం బిజేపి యువమోర్చా జిల్లా అధ్యక్షుడు పువ్వాడి దామోదర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొమ్మి నరసింహారావు ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని లా కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. క్విజ్ కాలేజి విద్యార్థులు, లా కళాశాల విద్యార్థులు, యువ మోర్చా నాయకులు శిబిరంలో రక్తదానం చేసారు. ఆడిషనల్ ఎస్పీ శ్రీధరరావు ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా బిజేపి అధ్యక్షుడు పీవీ శివా రెడ్డి, డాక్టర్ సెల్ కార్యవర్గ సభ్యుడు కొమ్మి నరసింహారావు, జిల్లా ఇన్చార్జి రవి శంకర్, బాపట్ల జిల్లా ఇన్చార్జి క్రిష్ణా రెడ్డి, ఒంగోలు నియోజక వర్గ ఇన్చార్జి వైసీ యోగయ్య యాదవ్, సురేష్, నాయక్, రాము, శ్రీనివాసరావు, రామక్రిష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


