ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసిపి జి శంకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కమీషనర్ శ్రీ. సి.వి. ఆనంద్ మరియు ట్రాఫిక్ అడిషనల్ సి.పి శ్రీ. విశ్వ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు శుక్రవారం సికింద్రాబాద్ లోని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులకు రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఏసిపి శంకర్ రాజు మాట్లాడుతూ రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 2024లో ఇప్పటి వరకు 2,97,000 కేసులు బుక్ అవ్వగా ఒక వ్యక్తి మరణించగా, 128 మంది గాయపడ్డారు, గతేడాది ఎనిమిది మంది మరణించగా, 150 మంది గాయపడ్డారని తెలిపారు. మోటార్ వెహికల్ చట్ట ప్రకారం రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే సెక్షన్ 119/177 మరియు 184 ప్రకారం శిక్షార్హమైనది లేదా FIR U/s 281 BNS కింద ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 1,000 జరిమానా లేదా రెండూ విధిస్తారు. స్పెషల్ డ్రైవ్ సమయంలో, చాలా మంది ఏదో ఒక అత్యవసర పరిస్థితిలో మెడికల్ ఎమర్జెన్సీలకు హాజరుకావాలని అంటున్నారు. అత్యవసర పరిస్థితుల సాకుతో కొంత దూరం తప్పించుకోవడానికి, వారు రాంగ్ సైడ్ డ్రైవింగ్‌లో మునిగిపోతారు, ఇది వారి ప్రాణాలకు మరియు ఇతర వాహనదారులు లేదా పాదచారుల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తుందని అభ్యర్థించారు. వాహనాలు నిర్లక్ష్యముగ నడపటం ఎప్పుడు ప్రమాదకరం అన్నారు. రోడ్డు మీద ఆదమరచి డ్రైవింగ్ చేస్తే ప్రాణాలకు ప్రమాదం. వాహనాలకు భీమా తప్పనిసరిగా చేయించాలి. ఇట్టి కార్యక్రమములో సుమారు 50 మంది ఐసీఐసీఐ ఉద్యోగులు, బ్రాంచ్ మేనేజర్ బైసాని కిషోర్ బాబు , అడ్మిన్ శ్రీవాత్సవ్ మరియు హీరో మోటోకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ సాదిక్ సాగర్, అబ్దుల్ మాజిద్ HG అధికారి TTI బేగంపేట పాల్గొన్నారు.

