యోగాసనా భారత్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22, ఆదివారం ఉదయం 8 గం.లకు ప్రారంభం కానున్న జిల్లా స్థాయి యోగాసన పోటీల వేదిక అనివార్యకారణముల వలన అంజయ్య రోడ్ఢు నందలి ఆంధ్రకేసరి విద్యాకేంద్రం నుండి చంద్రయ్య నగర్ లోని సరస్వతి శిశుమందిర్ ప్రాంగణమునకు మార్చినట్లు యోగాసనా భారత్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు బోయపాటి రవి, కార్యదర్శి సోమ సుబ్బారావు, కోశాధికారి వలివేటి సుధీర్ ఒక ప్రకటనలో తెలిపారు.
పోటీల ప్రారంభము, వివిధ విభాగాల పోటీలు అన్నీ కూడా గతంలో తెలిపినట్లే సమయానికి జరుగుతాయని కనుక యోగాసన పోటీ దారులు, ప్రజలు, మీడియా మిత్రులు ఈ వేదిక మార్పును గమనించి చంద్రయ్య నగర్ లోని శిశుమందిర్ వద్దకు రావలసిందిగా కోరారు.
