అజరామరమైన పాత్రలకు జీవం పోయటం ద్వారా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని సూర్యశ్రీ ట్రస్టు వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ అన్నారు. ఎ.ఎన్.ఆర్. శతజయంతి సందర్భంగా అక్కినేని కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉదయం కొత్తకూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న అక్కినేని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి విగ్రహాన్ని అక్కినేని కళాపరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యక్షులు కళ్ళగుంట కృష్ణయ్యను ప్రకాశంజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు అభినందించారు. సాయంత్రం సి.వి.ఎన్. రీడింగ్ రూంలో ఆవరణలో అక్కినేని సినీ గీతాలతో నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. గాయనీగాయకులు బాలరాజు, హేమమాలిని, విజయ్, పూర్ణిమ, సంస్థ అధ్యక్షుడు కల్లగుంట కృష్ణ పాడిన పాటలు అల్లరించాయి. పొన్నూరు వేంకట శ్రీనివాసులు వ్యాఖ్యానం రసవత్తరంగా సాగింది. కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన ఘంటసాల శతజయంతి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని మండువా మురళికృష్ణ ప్రారంభించారు. అనంతరం అక్కినేని కళాపరిషత్ అధ్యక్షులు కల్లగుంట కృష్ణయ్య అతిధులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బోడపాటి sai నవీన్, ఆలూరు రామారావు, బేతంశెట్టి హరిబాబు, తొట్టెంపూడి కృపారావు, మండవ సుబ్బారావు, ఓరుగంటి ప్రసాద్, సి.హెచ్.లక్ష్మీనారాయణ, పొన్నలూరు జానకీరామ్, గుర్రం కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

