వైఎస్సార్సీపీ కుటుంబానికి అత్యంత విధేయులుగా వ్యవహరిస్తూ ఆ కుటుంబాన్ని నమ్ముకొని కష్టకాలంలో సైతం మాజీ సీఎం వైఎస్ జగన్ వెంట సుదీర్ఘ కాలం నడిచిన బూచేపల్లి కుటుంబ సేవలకు గుర్తింపుగా ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిని, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. ముందుగా తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, యర్రగొండ పాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు కె నాగార్జున రెడ్డి, అన్నా రాంబాబు, కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణలతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులుగా డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిని, పార్లమెంటు నియోజక వర్గ పరిశీలకులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షులుగా ఎంపికఅయిన డాక్టర్ బూచేపల్లిని, చెవి రెడ్డిని ఎమ్మెల్యే చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యేలు, కాకుమాను రాజశేఖర్, మారెడ్డి సుబ్బా రెడ్డిను అభినందించారు. జిల్లా వ్వాప్తంగా, దర్శి నియోజక వర్గంలో డాక్టర్ బూచేపల్లికి జిల్లా అధ్యక్షుడిగా నియమించటం పట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



