ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి వందరోజుల పరిపాలన పూర్తి కావడంతో ” ఇది మంచి ప్రభుత్వం ” కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయనను ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ, సచివాలయాలు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ మాత్యులు డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్, సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్.విజయ్ కుమార్, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, చీరాల శాసనసభ్యులు ఎం.ఎం.కొండయ్య, గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠీ, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ బి.సహదిత్ వెంకట్ త్రివినాగ్, ఇతర అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం 2:32 గంటలకు ‘ చతుర్వాటిక విల్లాస్ ‘ లో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండ్ అయింది. సాయంత్రం 5:30 గంటలకు హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయింది. ప్రకాశం జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసిన గంటల వ్యవధిలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి భద్రత చర్యలు తీసుకోవడంతోపాటు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు చేయడంతో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా ముగిసింది

