రాష్ట్రంలో పేదలకు సంక్షే మాన్ని అందించే మంచి ప్రభుత్వ పాలన కొనసాగు తుందని, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని మండల టీడీపీ యువ నాయకులు ఇడమకంటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు గత వైసీపీ ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లను రూ.3వేలు నుంచి ఒకేసారి రూ.4వేలకు పెంచి అత్యంత సాహెూపేతమైన నిర్ణయం తీసుకున్నారనీ అన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత కల్పించారని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1న జీతాలు చెల్లింపు కార్యక్రమం చేపట్టారు. విజయవాడలో వరద బాధితులను కంటికి రెప్పలా 10 రోజుల పాటు బస్సులో ఉండి ఓ తండ్రిలా ప్రజల్ని ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. సచివాలయ సిబ్బంది సర్వేయర్ మల్లిఖార్జున పాల్గొన్నారు.
