రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధికి ఏ మాత్రం చొరవ చూపక ఐదు సంవత్సరాలపాటు తిరోగమనలో నిలిపిన వైసిపి ప్రభుత్వాన్ని తమ ఓటు ద్వారా ఎన్నికల్లో తిరస్కరించి జనరంజక పాలన అందించే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపించి రాష్ట్ర అభివృద్ధి తద్వారా తమ అభివృద్ధికి తాము మార్గం సుగమమం చేసుకున్నారని తెదేపా నాయకులు నూతలపాటి ప్రసాద్ తెలిపారు.
రాష్ట్రంలో ఎన్డిఏ పక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడి 100రోజులు పూర్తైన సందర్భముగా ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను ఈ వందరోజులలో పూర్తిచేసిన వివరాలను ప్రజలకు తెలపడానికి కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటూ కరపత్రాలను ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమాన్ని స్థానిక నగరపాలక సంస్థ పరిధిలోని 27, 30 డివిజన్ సీతారామపురంలో నూతలపాటి ప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానాల్లో చెప్పిన విధంగా మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారని, చెప్పిన విధముగా వెయ్యి రూపాయలు పెంచి పింఛన్లు పంపిణీ చేయడం పంపిణీ చేయడం మరియు అన్న క్యాంటీన్ ప్రారంభించి అనాధలు అభాగ్యులు ఎందరో పేదవారికి ఐదు రూపాయలకే కడుపునిండా భోజనాన్ని అందించడం చేశారని తెలిపారు అంతేకాకుండా వరద ముప్పుతో విజయవాడలో మునిగిన సింగ్ నగర్ వాసులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి స్వయంగా పగలనకా రాత్రనకా అధికారులను సమన్వయం చేసుకొంటూ ముందుకు సాగారని వివరించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు వాకాటి వెంకటేష్, శివ, బిజెపి మీడియా ఇంచార్జ్ ధనిశెట్టి రామనాయుడు, సచివాలయం అధికారి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

