బడుగు బలహీనవర్గాల నాయకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి దివంగత కూన వెంకటేష్ గౌడ్ అని సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కోట నీలిమ అన్నారు. ఆదివారం కూన వెంకటేష్ గౌడ్ దశదినకర్మ కార్యక్రమంలో కోట నీలిమ పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూన వెంకటేష్ గౌడ్ రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని ఆమె కోరారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కూన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధించారు.రాజకీయాలలో ఆయన చూపిన మార్గం ఆదర్శప్రాయమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సనత్ నగర్ నియోజక వర్గం మాజీ బి బ్లాక్ అధ్యక్షుడు షేక్ గౌస్, ప్రకాశం నగర్ శ్రీ భూలక్ష్మి దేవాలయం నిర్మాణ దాత, కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధామ ,కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అభిషేక్ అడపా, మనోజ్, కృష్ణ ,పాండుగౌడ్ తదితరులు ఉన్నారు.


