ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుంది – రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
సోమవారం కనిగిరి నియోజక వర్గం, పామూరు, వెలిగండ్ల లలో ఏర్పాటుచేసిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్థానిక శాసనసభ్యులు డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి తో కలసి పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా పామూరు మండల కేంద్రంలో 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 23 అంతర్గత సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసన సభ్యులు డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి తో కలసి సీ.ఎస్.పురం మండలం, మెట్టపాలెంలోని శ్రీ శ్రీ శ్రీ నారాయణ స్వామి వారి దేవస్థానంలో జరుగుచున్న స్వామి వారి ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసన సభ్యులు డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి తో కలసి వెలిగండ్ల మండలం, నాగిరెడ్డిపల్లిలో కోటి 87 లక్షలతో నిర్మించిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం వెలిగండ్ల మండల కేంద్రంలోని ఎస్ సీ కాలనీలో 65 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. 43.60 లక్షలతో నిర్మించిన సచివాలయం భవనాన్ని, 21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, శాసన సభ్యులు డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి తో కలసి ప్రారంభించారు. శ్యామల వెంకట రెడ్డి పౌండేషన్ ఆద్వర్యంలో నిర్మించిన బస్ షెల్టర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. అందుకు నిదర్శనం ఇచ్చిన హామీలను నిలబెట్టు కోవడంలో ఈ వంద రోజులు పాలన దానికి ఉదాహరణ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాల ద్వారా ప్రజా వేదికలను నిర్వహిస్తున్నామన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమం సాధించి, మొదటి వంద రోజుల్లోనే ‘ఇది మంచి ప్రభుత్వం’ అని ప్రజల చేత అనిపించుకుంటోంది మన కూటమి ప్రభుత్వం” అని పేర్కొన్నారు. ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి హామీని నెరవేర్చడం జరుగుతుందన్నారు. పింఛను మొత్తాన్ని ఒకేసారి రూ.1000 పెంచి… రూ.4వేలు చేయడంతో పాటు, ఎన్డీయే అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో ఒక్కొక్కరికీ రూ.7 వేల చొప్పున అందజేశాం. ఒకేరోజు 65.18 లక్షల మందికి ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణీ చేశామన్నారు దేశంలోనే ఇదో తిరుగులేని సంక్షేమ చరిత్ర అని అన్నారు.
నిరుద్యోగ యువతకు అండగా ఉంటూ 16,437 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటించడం జరిగిందన్నారు.
ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు బకాయిలు రూ.1,674.47 కోట్లు చెల్లించి అన్నదాతను ఆదుకున్నామన్నారు.
పేదలకు పూటకు రూ.5కే ఆకలి తీర్చే 175 అన్నక్యాంటీన్లను పునఃప్రారంభించడం జరిగిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దుచేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పథకం కింద పనులు జరుగుచున్నవని, పంచాయతీలు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీరం చేయడం జరిగిందని, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వం నుండి పంచాయతీలకు మంజూరైన నిధులను పంచాయతీలకే విడుదల చేసిందని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో నియోజక వర్గ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయుటకు అవసరమైన సబ్ స్టేషన్లు, ట్రాన్స్పార్మర్లు ను ప్రాధాన్యతా క్రమంలో మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

శాసన సభ్యులు డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చి వంద రోజులవుతున్న సందర్భంగా ఈ నెల 20 నుంచి ఇది మంచి ప్రభుత్వం నినాదంతో మంత్రులు, ఎమ్మెల్యేలు,స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజల్ని కలసి వారి సమస్యలను తెలుసుకోవడం జరుగుచున్నదన్నారు.
3 వేల రూపాయలు పెన్షన్ ను 4 వేల రూపాయలకు పెంచడమే కాక 3 నెలల బకాయిలను కలిపి అందించామన్నారు. పేదల ఆకలిని తీర్చేందుకు 5 రూపాయలకే నాణ్యమైన ఆహరం అందించేందుకు అన్నా క్యాంటిన్లను ప్రారంభించామన్నారు. దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీ చేస్తామని, మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణం పథకంను అమలు చేస్తామన్నారు. విజయవాడ నగరం వరదల్లో విలవిల్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పది రోజులపాటు బస్సులోనే ఉంటూ, నిద్రాహారాలు మాని వరద బాధితులకు అండగా నిలిచారన్నారు. విజయవాడ వరద బాధితులకు అండగా నిలబడటంలో ముఖ్యమంత్రి గారి శ్రమ రాష్ట్రం లోపలా… బయటా అన్ని వర్గాల ప్రజల ప్రశంసలు పొందిందని తెలిపారు. ఈ నియోజక వర్గం వెనుకబడిన నియోజక వర్గం అని, ఈ ప్రాంతం అభివృద్ధి కి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలు రోడ్లు, సాగునీరు, తాగు నీరు అడుగుచున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ రోజు 5 కోట్ల రూపాయలతో పామూరులో అంతర్గత సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని, రానున్న రోజుల్లో పామూరు లో మరో 5 కోట్ల రూపాయలతో సైడు డ్రైన్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని డా. ఉగ్ర నరసింహ రెడ్డి తెలిపారు. వెలిగండ్ల మండలం నాగిరెడ్డి పల్లిలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని, వెలిగండ్ల మండల కేంద్రంలో రోడ్లకు శంకుస్థాపన, సచివాలయం భవనాన్ని, ఆర్బికే భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జాన్ ఇర్విన్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *