వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్థ సెప్టెంబర్ 23వ తేదీ అంతర్జాతీయ సంస్థగా మారిన రోజును పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న ఆరు రాష్ట్రాల్లో స్థానిక వాసవి క్లబ్స్ సభ్యులు అనాధలు, అభాగ్యులు, పేదలకు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాయని వాసవి కేసిజిఎఫ్ యూత్ ఒంగోలు మరియు వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు కూనాల శ్రీనివాసరావు మరియు నల్లమల్లి బదిలీ నారాయణులు తెలిపారు. అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఆదేశానుసారం ప్రతి సందర్భాన్ని సేవగా మలుచుకుని ఇతోదికముగా వాసవి క్లబ్ సభ్యులు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఈ సందర్భముగా స్థానిక సీతారాంపురంలోని సమత మహిళా వేదిక వృద్ధాశ్రమంలో మాతృమూర్తులకు దుప్పట్లను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బదరీనారాయణ, యూత్ అధ్యక్షులు కూనల శ్రీనివాసరావు, కార్యదర్శులు పద్మనాభుని నందకుమార్, దోరడ్ల శ్రీనివాసులు కోశాధికారులు గుర్రం సునీల్ కుమార్, పవన్ కుమార్ మరియు భూమా శ్రీనివాసులు తదితర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.


