బేగంపేట కూకటపల్లి నాలా పరివాహక బస్తీలలోప్రజలు సుస్తీకి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు దోమల దాడి ,మరోవైపు జ్వరాలు ,ఇంకొక వైపు కలుషిత మై తీవ్ర దుర్వాసనతో వస్తున్న తాగునీటితో నాలా పరివాహక బస్తీలన్నీ సుస్తీ బాట పట్టాయని, ఆయా బస్తీల ప్రజల ఆరోపిస్తున్నారు. కూకట్ పల్లి నాలా బేగంపేటలోని పలు ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తూ ట్యాంక్ బండ్ మీదుగా హుస్సేన్ సాగర్ లోకి చేరుతుంది. అయితే ఈ నాళాలో ఫతేనగర్ ,కూకట్ పల్లి, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు చెందిన పారిశ్రామిక వ్యర్ధాలు కలుస్తుండటంతో నాలాలో ప్రవహిస్తున్న నీరు ఉదయం సాయంత్రం సమయంలో నురగలు గక్కుతూ తీవ్ర దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బేగంపేటలో కూకట్ పల్లి నాలాను ఆనుకొని ఓల్డ్ కస్టమ్స్ బస్తి, వడ్డెర బస్తి ,బ్రాహ్మణవాడి, మాతాజీ నగర్ ,అల్లం తోట బాయి, చికోటి గార్డెన్, ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ ,ఎన్బిటి నగర్, పాటిగడ్డ ల మీద నెక్లెస్ రోడ్ లోని ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ లోకి కూకట్పల్లి నాలా నీరు చేరుతుంది. అయితే ఈ నాలా నీటి ప్రవాహం నిత్యం అధిక స్థాయిలో ప్రవహిస్తుండటంతో పరివాహక బస్తీల్లో దోమల దాడి తీవ్రంగా ఉందని దీంతో ప్రజలు జలుబు జ్వరం స్కిన్ ఎలర్జీలతో బాధపడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. అలాగే వర్షం కురిసిన సమయాల్లో నాలా నీరు బస్తీ లోకి వస్తుండటం మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది .ఓల్డ్ కస్టమ్స్ బస్తీ బ్రాహ్మణవాడి అల్లం తోట బాయిలలో తాగునీరు సైతం తీవ్ర దుర్వాసన వెదజల్లుతూ వస్తున్నడాన్ని ప్రజలు దుయ్యబడుతున్నారు. ఈ విషయాన్ని ఆయా బస్తేలకు చెందిన ప్రజలు వాటర్ వర్క్స్ శాఖ అధికారులకు సైతం పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్రాహ్మణువాడి లైన్ నెంబర్ 1 లో నీరు పోయే మార్గాన్ని మూసివేసి గోడ నిర్మించడంతో ఆ ప్రాంతంలో వర్షం కురిసిన సమయంలో నీరు పెద్ద ఎత్తున నిలిచి ఉంటుందని స్థానికులు ఆరోపించారు. వర్షపు నీరుతో పాటు డ్రైనేజీలో నీరు పొంగిపొర్లు తూ ఉండటంతో వ్యర్ధాలన్నీ అక్కడే పేరుకుపోయి పరిసరాలన్నీ తీవ్రదుర్గంధమయంగా మారాయని స్థానికులు ఆరోపించారు. ఈ సమస్యపై అన్ని శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోకపోవడంతో అక్కడ ఇల్లు ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలియజేశారు దీనికి తోడు దోమలు ఉదయం సాయంత్రం మనిషి నిలుచుంటే చాలు పెద్ద ఎత్తున మనిషిని చుట్టిముట్టి దాడి చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతంలో పాఠశాలలు కూడా ఉన్నాయని విద్యార్థులకు దోమల దాడితో జ్వరాలు వస్తున్నాయని, నీటి కలుషితం కావడంతో స్కిన్ ఎలర్జీ వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పై బస్తీలలో ప్రతి ఇంట్లో ఒకరిద్దరూ జలుబు జ్వరం వంటి వ్యాధులతో సతమతమవుతున్నారని తెలియజేశారు ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు కూకట్పల్లి నాలా పరివాహక బస్తీలను సందర్శించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పైబసీల ప్రజలు కోరుతున్నారు.
ఆరోగ్యశాఖ అధికారులు నాలా పరివాహక బస్తీలను సందర్శించాలి……
నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి దోమల నివారణకు బ్లీచింగ్ ఫాగింగ్ చేయాలి…. బిజెపి సీనియర్ నాయకులు నెమలి ఆనంద్……………….
బేగంపేటలో కూకట్ పల్లి
నాలా పరివాహ బస్తీలలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పర్యటించాలని ,ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అనారోగ్యానికి గురైన వారికి మందులు పంపిణీ చేయాలని బిజెపి సీనియర్ నాయకులు నెమలి ఆనంద్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే పై బసీల్లో నీరు నిలిచి ఉండే ప్రాంతాలను గుర్తించి బ్లీచింగ్ చేయించాలని రోజు మార్చి రోజు ఫాగింగ్ చేయాలని అధికారులను కోరారు. ఆరోగ్యశాఖ అధికారులు వాటర్ అధికారులు జిహెచ్ఎంసి అధికారులు వెంటనే సందర్శించాలని ముందస్తు జాగ్రత్త చర్యలు ఆనంద్ డిమాండ్ చేశారు.

