ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులైన ప్రజలంతా ఉపయోగించుకోవాలని సనత్ నగర్ నియోజకవర్గం మాజీ ఏ బ్లాక్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అభిషేక్ ఆడపాలు ప్రజలకు అవగాహన కల్పించారు.సోమవారం సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ ఆదేశాల మేరకు బేగంపేట డివిజన్ పరిధిలోని పాటిగేడ్డ లో ప్రజాపాలన 2 అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ గౌస్,అభిషేక్ అడపా లు మాట్లాడుతూ బేగంపేట డివిజన్ పరిధిలోని పాటిగద్ద లో అధిక శాతం మంది పేద,బడుగు బలహీనవర్గాలకు చెందిన వారు నివసిస్తూ వుంటారని,వారంతా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఉపయోగించుకోవాలని సూచించారు.అలాగే రేషన్ కార్డులు లేని వారు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతా క్రమంలో అమలు చేస్తున్న విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలతో వారు బూత్ స్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హనీఫ్ ఖాన్,ఆల్టమాష్,మహబూబ్ అలీ. నసీరుద్దీన్ అడ్డూ తదితరులు పాల్గొన్నారు.
