పేద విద్యార్థుల అభ్యన్నతికి
తోడ్పాటు అందించడం అభినందనీయమని కస్తూరిబా ప్రిన్సిపాల్ సుజిత అన్నారు. మార్కాపు రానికి చెందిన రిటైర్ ఉపాధ్యాయుడు, దేశ ప్రధానితో సన్మానం అందుకున్న రామ్ భూపాల్ రెడ్డి తన సొంత డబ్బులతో జిల్లా వ్యాప్తంగా ఉన్న సాం ఘిక సంక్షేమ పాఠశాలలు, కేజీబీవీల్లోని పది, ఇంట ర్ లో గత ఏడాది పరీక్ష ఫలితాల్లో మొదటి, రెండో స్థానాలు పొందిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంస పత్రాలు అందజేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం తాళ్లూరు కేజీబీవీ పాఠశాలల్లోని పది, ఇంటర్ లో మొదటి రెండు ర్యాంకులు పొం దిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసపత్రాలు అం దచేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సుజిత మాట్లాడుతూ రామభూపాల్ రెడ్డి
సేవలు ప్రశంసనీయమని విద్యార్థుల అభ్యన్నతికి కృషి చేయడం అభినందనీ యమన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి, ఇష్టంతో చదివి వితే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చన్నారు. రామ్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ తాను కూడా ఉపాధ్యా యుడిగా పనిచేశానని, చదువుకునే విద్యార్థులంటే తనకు ఎంతో ఇష్టమని, విద్యార్థులకు ఏదో చేయాలనే తపన ఉండటంతో ఇలా చేస్తున్నానని పేర్కొన్నారు.
