వ్యవసాయంలో సాంకేతికతో, రసాయన రహితంగా సాగుచేస్తే మంచి దిగుబడులు రావటంతో పాటు ఆర్థికంగా ఆరోగ్యపరంగా మేలు జరుగుతుందని వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. తూర్పుగంగవరంలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన క్షేత్రాలను ఎవో పరిశీలించారు. 20 సెంట్లలో వేసిన పలు రకాల ఆకుకూరలు, కూరగాయలు, ఎర పంటలు, రక్షిత పంటలు, పండ్ల చెట్లను పరశీలించారు. వేప గింజల ద్రావణంలో తయారు చేసిన జీవామృతాన్ని పిచికారి చేయటం జరిగిందని అన్నారు. ప్రకృతి సాగు ఇన్చార్జి నరసింహులు, రైతు గూడ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
