సిటీ సివిల్ కోర్ట్ స్మాల్ కాజేస్ చీఫ్ జడ్జి నందికొండ నర్సింగ్ రావు ను మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. నర్సింగ్ రావు మాతృమూర్తి మణెమ్మ సోమవారం రాత్రి మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ఓల్డ్ బోయిగూడలోని వారి నివాసానికి వెళ్లి మణెమ్మ పార్ధీవ దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నర్సింగ్ రావు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, ఎమ్మెల్యే వెంట రాంగోపాల్ పేట డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.
