పోషకాల లోపం, తెగుళ్లపై అవగాహన కలిగి తేడా గుర్తించాలని తాళ్లూరు వ్యవసాయాధికారి బి. ప్రసాదరావు అన్నారు. మండలంలోని రజానగరం, మల్కాపురం గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది. కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం పంటలలో అనేక లోపాలు గుర్తించి నివారణకు తగిన సూచనలు చేసారు. పశుసంవర్థక శాఖ ఎహెచ్ ఎ రాజేష్, ఎనర్జీ అనిస్టెంట్ కె నరసింహారావు, ఫిషరీస్ అసిస్టెంట్ ఎలీషా, ఎఈఓ నాగరాజు, విఏఏ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

