వారాహి ఉపాసకులు మహారుద్రస్వామి నేతృత్వములో శ్రీ వారాహి మహా రథయాత్ర తిరుపతి నుండి బయలుదేరి విశాఖపట్నం వెళ్లే దారిలో ఒంగోలు నగరంలో స్థానిక భక్తులు దాసరి నరసింహారావు, కరణం రమాదేవి, కొక్కిరాల సంజీవకుమార్, తంజావూరి శ్రీనివాసమూర్తి, పాలెం సురేష్ బాబు, కోనూరు రంగారావు నేరెళ్ల శ్రీనివాసరావు మరియు మువ్వల నాగరాజు పర్యవేక్షణలో సంతపేట తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో మంగళవారం సాయంత్రం వారాహి యాగ క్రతువును ఘనంగా నిర్వహించారు. సాయితేజా రెడ్డి యాగపర్యవేక్షణ చేశారు. ఆ సందర్భంగా ఒంగోలు పురవీధుల్లో రథయాత్రను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రధముపై అమ్మవారిని ప్రతిష్టింపజేసి శోభాయమానంగా, సంప్రదాయబద్ధంగా, ఘనంగా నిర్వహించారు. కర్నూల్ రోడ్డు ఫ్లైఓవర్ వద్ద గల శ్రీ సిద్ధి వినాయక దేవస్థానం వద్ద నుండి బయలుదేరిన అమ్మవారి రథము స్థానిక సంతపేటలోని కళ్యాణ మండపం వరకు అద్భుతముగ సాగినది. గోమాత ముందు నడువగా… మహిళా భక్తుల కోలాటం ఆధ్యాత్మిక భావనలను ద్విగుణీకృతం చేశాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు రధము వెంట పయనించారు.


