స్వచ్ఛతాహి సేవపై విద్యార్థులకు దళిత రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కల్పించారు. గాంధీజీ స్వాతంత్య్రయంతో పాటు స్వచ్చమైన భారత్, అభివృద్ధి భారత్‌ను అక్షాంక్షించారని వికే ఉన్నత జూనియర్ కళాశాల ప్రన్సిపాల్ కె అంజనేయులు పేర్కోన్నారు. దళిత రిసోర్స్ సెంటర్ రీజినల్ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వర రావు అధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో స్వచ్చతను గురించి తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. డిబిఆర్సీ రాష్ట్ర పోగ్రాం కోఆర్డినేటర్ రమణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం అక్టోబర్ 2 వరకు చేపట్టిన స్వచ్చతాహి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున ప్రతి ఒక్కరూ పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. దేశ పరిశుభ్రతలో ప్రజలు పాత్ర ప్రముఖమని అన్నారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.
