సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. తాళ్లూరు మండల కేంద్రం లో బుధవారం ‘ ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ… సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరులు శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం సంక్షోభం నుండి అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నట్లు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తూ నేడు వంద రోజులలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అమరావతి పునర్మిణానికి, పోలవం ప్రాజెక్టు జీవం పోయడానికి కేంద్ర ప్రభుత్వసహకారంతో మన ప్రభుత్వం ముందుకు పోతున్నదని అన్నారు. తాళ్లూరు మండల కేంద్రానికి వెల్లంపల్లి నుండి తాళ్లూరు వరకు రోడ్ ను నాడు తాతగారైన మంత్రి గొట్టిపాటి హనుమంతరావు రూ.40 లక్షలు మంజూరు చేయించి బాగు చేసారని గుర్తు చేసారు. నేడు తాళ్లూరు మండలంలో అవసరమైన చీమకుర్తి అడ్డరోడ్ నుండి కుంకుపాడు వరకు, తాళ్లూరు, గంగవరం, ముండ్లమూరు రోడ్లో మిగిలిన రెండు కిలో మీటర్లు డబుల్ రోడ్ నిర్మాణానికి తగిన కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గొట్టిపాటి కుటుంబం నిత్యం ప్రజల కోసం పరితపించే కుటుంబమే అన్న విషయాన్ని వివరించారు. వరదల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో నేర్పుగా, ఓర్పుగా వ్యవహరించిన తీరు ప్రతి ఒక్క యువనాయకులకు, మాకు ఆదర్శమని కొనియాడారు. ఇటీవల జాబ్ మేళాలు నిర్వహించి నియోజక వర్గంలో 587 మందికి ఉద్యోగాలు కల్పించామని, ఆరోగ్య శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు క్రమ పద్ధతిలో
నిర్వహించేందుకు ప్రణాళికలకు ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో అనేక లోపాలు ఉన్నాయని, చివరికి పవిత్రమైన తిరుపతి లడ్డూల విషయంలో కూడ కల్తీ వ్యవహారం అక్షేపనీయమని అన్నారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ…. గత ప్రభుత్వంలో కేవలం సంక్షేమంపై మాత్రమే దృష్టి సారించటంతో అభివృద్ధి కుటుపడినదని, నేడు సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించిన ఎన్డీఏ ప్రభుత్వంలో ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి సారధ్యంలో మండలంలో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ముందుగా మాజీ సీఎం నందమూరు తారక రామారావు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇది మంచి ప్రభుత్వం స్టిక్టర్లను గ్రామంలో ఇంటింటికి తిరిగి గడపలకు అంటించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, సీనియర్ నాయకుడు ఇడమకంటి రమణా రెడ్డి, ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, మాజీ అధ్యక్షుడు శాగం కొండా రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ పెద కాలేషా వలి(బడే), జిల్లా కార్యవర్గ సభ్యుడు మానం రమేష్, ఇన్చార్జి ఎంపీడీఓ కెజీఎన్ రాజు, పలు గ్రామాల సర్పంచిలు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.





