తాళ్లూరు మండలంలోని పలుశాఖల అధికారులు బదిలీ పై వెళ్లారు. ఎంపీడీవో కేవై యుగకీర్తిని గుంటూరు జిల్లాకు, తహసీల్దార్ పి.సింగారావును బాపట్ల జిల్లాకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరుజిల్లా నుంచి జిల్లాకు అలాటైన కె.నాగలక్ష్మిని తాళ్లూరు తహసీల్దార్గా నియ మిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న అడ్మిస్ట్రేటివ్ అధికారి వజ్జాశ్రీనివాసరావును చీమకుర్తి ఎంపీడీవో కార్యాలయానికి బదిలీచేశారు. ఆయన స్థానంలో ఒంగోలు జడ్పీలో పనిచేస్తున్న అడ్మిస్ట్రేటివ్ అధికారి ఎస్.సత్యంను తాళ్లూరు ఎంపీడీవో కార్యాలయానికి బదిలీ చేశారు. అయితే అధికారులు అందరు కూడా అక్టోబర్ 1 నుండి విధుల్లోకి హాజరయ్యే అవకాశం ఉన్నది.
తాళ్లూరు మండలంలో పలువురు అధికారుల బదిలీలు
25
Sep