ఏడాది క్రితం తప్పిపోయి ఒంగోలు బాల సదనంలో వసతి పొందుతున్న ఇరువురు బాలికలు ఎట్టకేలకు వారి నాయనమ్మకు బుధవారం జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా సమక్షంలో అప్పగించారు. వివరాలలోనికి వెలితే… 2023 నవంబర్ నెలలో బాపట్లకు చెందిన ఇరువురు పిల్లలు తప్పిపోయి తల్లిదండ్రులకు గుర్తించ లేక బాల సదన్లో సంరక్షణలో ఉంచారు. మాధ్యమాల ద్వారా ప్రకటనల ద్వారా సమాచారం ఇచ్చినా ఫలితం లేదు. దీంతో గత వారం రోజులుగా బాపట్ల జిల్లా స్టువార్టు పురంలో వారి నాయనమ్మ, బంధువులను గుర్తించి వారికి అప్పగించారు. తల్లిదండ్రులు లేక పోవటంతో వారిని బాపట్ల బాల సధనంలో ఉంచి విద్యను అందించవలసినదిగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కుమార్, బాలల సంక్షేమ కమిటి సభ్యులు డి నీలిమ, సుమనశ్రీ తదితరులు పాల్గొన్నారు.
