శ్రీ వేంకటేశ్వరస్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ కూటమి నేతలు, రాజకీయ లబ్ధి కోసం దేవుణ్ని దుర్మార్గంగా వాడుకుంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే, వారికి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వంత పాడుతున్నారని మండిపడ్డారు.
కూటమి నేతలు స్వామివారి పట్ల చేసిన పాపాల ప్రక్షాళన కోసమే ఈనెల 28న రాష్ట్రమంతా ప్రతి నియోజకవర్గంలోని వివిధ దేవాలయాల్లో వైయస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేయనున్నారని వెల్లడించారు. పార్టీ కార్యకర్తలంతా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తప్పు చేసిన వారే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారన్న మాజీ మంత్రి.. చంద్రబాబు, పవన్ శరీరాలు వేరైనా, ఒకే ఆత్మలా తిరుగుతున్నారని, అందుకే పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాడు బుద్ధి, కుళ్లిన మెదడుతో మలినపు మాటలు మాట్లాడారని ఆగ్రహించారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతో పాటు, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశామన్న వేదన వారి అంతరాత్మను దహించి వేస్తోందని, అందుకే ఈ ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నారని తెలిపారు.
గతంలో భీమవరంలో బాప్టిజం తీసుకున్నామన్నదీ.. ముస్లిం సోదరుల ఇంటికి వెళ్ళి హలాల్ చేసిన మాంసమేనా? అని అడిగిన విషయాన్ని, రష్యా చర్చిలో ఏసు ప్రభువు ముందు మోకాళ్ళదండ వేసింది, పిల్లలకు క్రైస్తవ పేర్లు పెట్టింది కూడా పవన్ అన్నది ఎవరూ మర్చిపోలేదని పేర్ని నాని వివరించారు.
తన రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీవారి ఆలయం, రాష్ట్ర ప్రతిష్ట మంట గలిసే విధంగా సీఎం చంద్రబాబు మాట్లాడారన్న, మాజీ మంత్రి కొడాలి నాని, అందుకు చంద్రబాబును ఆ దేవదేవుడు ఎప్పటికీ క్షమించడని స్పష్టం చేశారు. చంద్రబాబు ఐదేళ్ల గత పాలనలో నలుగురు బిడ్డర్లుకు నాలుగు దఫాలుగా టెండర్లు ఇవ్వగా.. నెయ్యిలో నాణ్యత లేదని 14 ట్యాంకర్లు వెనక్కి పంపింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కూడా 18 నెయ్యి ట్యాంకర్లు తిప్పి పంపారని గుర్తు చేశారు. టీటీడీలో సరుకుల నాణ్యతకు అంత ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు.
ఇప్పుడు నెయ్యి నాణ్యతపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు చూస్తే.. అవన్నీ ఆయన పదవిలోకి వచ్చిన తర్వాతే సరఫరా అయ్యాయని కొడాలి నాని గుర్తు చేశారు. అయితే అది తమ ప్రభుత్వ హయాంలో జరిగిందంటూ నిందించారని, రాజకీయం చేసి శ్రీవారి ఆలయంతో పాటు, రాష్ట్ర ప్రతిష్టను కూడా దిగజార్చారని ఆయన ఆక్షేపించారు. జగన్‌గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలన్న దుర్భుద్ధితో చివరకు శ్రీవారి ప్రసాదాన్ని కూడా రాజకీయల్లోకి లాగిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. ఇది చాలా పెద్ద కుట్ర కాబట్టి, అత్యున్నతస్థాయి విచారణ కోరుతూ, జగన్‌గారు ప్రధానమంత్రి, సీజేఐకి లేఖ రాస్తే, చంద్రబాబు సిట్ ఏర్పాటు చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
తప్పు చేస్తే మక్కెలిరగ్గొడతానన్న చంద్రబాబు.. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రొఫెసర్‌పై దాడి, దౌర్జన్యం చేసినా, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అంబేద్కర్ చిత్రపటాన్ని చింపేసినా ఏ చర్య తీసుకోలేదని కొడాలి నాని ఆక్షేపించారు.
కూటమి నేతల పాపాల ప్రక్షాళనకే పూజలు:వైయస్సార్‌సీపీ నేతల ప్రకటన- వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రులు పేర్ని నాని (వెంకట్రామయ్య), కొడాలి నాని (వెంకటేశ్వరరావు). ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న పార్టీ నేత వల్లభనేని వంశీ. -టీటీడీ లడ్డూ తయారీపై చంద్రబాబు దారుణ ఆరోపణలు – తిరుమల శ్రీవారి పట్ల కూటమి నేతల దారుణ పాపాలు –
25
Sep