మాజీ ఎంపీ, ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృత దేహాన్ని టి.డి. పి నాయకులు, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు గురువారం సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో టి.డి.పి మండల పార్టీ అధ్యక్షులు బి. ఓబుల్ రెడ్డి జిల్లా కార్యదర్శి మానం రమేష్, రాష్ట్ర మైయినార్ట్ సెల్ కార్యదర్శి షేక్ కాలేషావలి (బడే), టిడిపి రాష్ట్ర యూత్ కార్యదర్శి వేణుబాబు, తెలుగు యువత వేణు ,బి.సి సెల్ అధ్యక్షుడు పిన్నిక రమేష్, క్లస్టర్ ఇంచార్జ్ ఆర్. వెంకట రావు, దర్శి కౌన్సిలర్ వి.సి రెడ్డి తదితరులు ఉన్నారు.
