విద్యార్థులు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి ఉండాలని ఎస్సై మల్లికార్జునరావు అన్నారు. స్థానిక వికె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం విద్యార్థులకు ఈవ్ టీజింగ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ… విద్యార్థులు సమయాన్ని చక్కగా ఉపయోగించుకొని మంచిగా విద్యను అభ్యసించాలని కోరారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. బయట వ్యక్తుల నుండి గాని.. పాఠశాలలో గాని ఏవైనా వ్యక్తిగత సమస్యలు ఉన్నా సరే ధైర్యంగా తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. మనోధైర్యంగా సమస్యను పరిష్కరించు కోవాల్సిన విషయాలపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు, మహిళా పోలీసులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
