జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ మెంబర్ జాతోతు హుస్సేన్ రెండు రోజులు పాటు జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా గిరిజన
సంక్షేమాధి కారి జగదీశ్వరరావు తెలిపారు. ఈ నెల 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటనలో భాగముగా 28 న ఉదయం 09.00 గంటలకు చీమకుర్తి లోని గిరిజన గురుకుల పాథశాల ను సందర్శించెదరు, తదుపరి కొప్పోలు మరియు చింతల మధ్య లో గల నక్కల కాలనీ ని సందర్శించెదరని, పిదప కొత్తపట్నం మండలం లోని రంగాయపాలెం యానాది కాలనీ లోని తుఫాన్ షెల్టర్ నందు ముఖా ముఖి కార్యక్రమములో గిరిజనుల సమస్యల పై చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఆ సమయములో అర్జీ లను సమర్పించవచ్చని తెలిపారు. మధ్యహ్నం 03.00 గంటలకు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్, ఒంగోలు లో మెంబెర్ మరియు కలెక్టరు , జిల్లా అధికారులతో సమీక్షా సమావేశము జరుగునని తెలిపారు. 29 న ఆదివారం ఉదయం 10.00 గంటలకు అంబేద్కర్ భవనం, ఒంగోలు నందు అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం, ప్రకాశం జిల్లా వారి సర్వ సభ్య సమావేశం జరుగును. సదరు సమావేశములో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ మెంబెర్ జాతోతు హుస్సేన్ పాల్గొనెదరని తెలిపారు. సాయంత్రమున హైదరాబాదు కు తిరిగి ప్రయాణం చేసెదరని వివరించారు.
కావున జిల్లాలోని గిరిజన ప్రజలు మరియు గిరిజన సంఘాల నాయకులు ఈ సమావేశము నకు హాజరై వారి విన్నపాలను తెలియ చేసుకొనవచ్చుని తెలిపారు.
జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ మెంబర్ జాతోతు హుస్సేన్ రెండు రోజులు జిల్లాలో పర్యటన -జిల్లా గిరిజన సంక్షేమాధి కారి జగదీశ్వరరావు
26
Sep