సికింద్రాబాద్ బిజీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కూకట్పల్లి విభాగ్ సికింద్రాబాద్ జిల్లా, ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర పండుగ, రంగురంగుల పువ్వుల పండగ అయిన బతుకమ్మ పండుగ పీజీ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండగ అయిన బతుకమ్మ సంబరాలను పీజీ కాలేజీలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు, అట్లాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కాలేజీ ఏబీవీపీ కమిటీని ఆయన అభినందించారు.
అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సెక్రెటరీ ఝాన్సీమాట్లాడుతూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మరియు తెలంగాణ సంప్రదాయాన్ని తెలియజేసే ఏకైక పండగ, రాష్ట్ర నలుమూలల నుండి ఆడపడుచులంతా ఉత్సాహంగా ఈ పండుగ కోసం ఎదురు చూస్తారని కొనియాడారు. పీజీ కాలేజీలో ఈ కార్యక్రమం నిర్వహించడాన్ని ఆమె అభినందించారు.
యూనివర్సిటీ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రవి కుమార్ జస్టి మాట్లాడుతూ ABVP చేసే కార్యక్రమాల్ని కొనియాడారు, ABVP ఏ కార్యక్రమం చేసిన విజయవంతంగా నిర్వహించడంలో విద్యార్థి పరిషత్ కు సాటిలేరని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి గొడవలు లేకుండా విజయవంతంగా ముగించడాన్ని ప్రిన్సిపాల్ ప్రశంసించారు.
ఈ కార్యక్రమానికి కూకట్పల్లి విభాగ్ కన్వీనర్ మరియు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనాథ్ , సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ బాలకృష్ణ , బేగంపేట్ టౌన్ సెక్రటరీ రాము , కాలేజ్ ప్రెసిడెంట్ విజయ్ , వైస్ ప్రెసిడెంట్ ఉదిత్ , కాలేజ్ సెక్రటరీ అభి , ప్రోగ్రాం ఆర్గనైజర్ పాండురంగ్ , మరియు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
