క్షేత్ర స్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలోశుక్రవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, వ్యవసాయ, మత్స్య శాఖ, పశు సంవర్ధక శాఖ, ఉద్యాన వన శాఖ, సెరి కల్చర్, మార్కెటింగ్ తదితర శాఖ అధికారులతో సమావేశమై ఆయా శాఖల ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాలు, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను, సాధించిన ప్రగతిపై శాఖల వారీగా సమీక్షించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్భంగా సంబంధిత శాఖల అధికారులు ఆయా శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, లక్ష్యాలను, పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ కు వివరించారు.
ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …. క్షేత్ర స్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ఆ సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. పక్షం రోజులకొకసారి వ్యవసాయ మరియు దాని అనుబంధ శాఖల పనితీరును సమీక్షించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ పంట నమోదు, ఈ కేవైసీ వంద శాతం జరిగేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రబీ 2024 కు సంబంధించి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని, క్షేత్ర స్థాయిలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో వుంచుకోవాలన్నారు. జిల్లాలో ఖరీఫ్ 2024 లో 45 వేల సిసిఆర్ సి కార్డులు కౌలు రైతులకు ఇచ్చేలా లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 42,033 కార్డులు జారీచేయడం జరిగిందని, మిగిలిన కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పొలం బడి కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించడంతో పాటు రైతాంగానికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఏ ప్రాంతంలో ఏ పంట వేసుస్తున్నారు, ఆ పంట సాగులో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు ఏమిటి తదితర విషయాలతో పూర్తి స్థాయిలో వివరాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉద్యాన పంటలను ప్రోత్సహించేలా, పంట విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా లో మత్స్య, పశు సంపద పై ప్రత్యేక దృష్టి సారించి, సంబంధిత రైతాంగానికి అవసరమైన సూచనలు సలహాలు ఇస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రైతు పండించిన పంటకు మార్కెట్ లో గిట్టు బాటు కలిగేలా మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఎక్కువ శాతం వర్షాధారం పై పంటలు పడుతున్నందున, జిల్లా డ్రిప్ ఇరిగేషన్ విధాన్నాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలన్నారు.
సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ జేడి ఎస్. శ్రీనివాస రావు, పశు సంవర్థక శాఖ జేడి డా. బేబి రాణి, మత్స్య శాఖ జేడి ఆవుల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపి చంద్, ఎపిఎంఐపి పిడి రమణ, జిల్లా సెరికల్చర్ అధికారి సుజయ్ కుమార్, మార్కెటింగ్, ఎపి సీడ్స్ శాఖల అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



