రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును దర్శి నియోజకవర్గ కాపుసంఘం మహిళా అధ్యక్షురాలు మారాబత్తుల సుజాతమంగళగిరి టీడీపీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా శుక్రవారం కలిశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో దర్శినియోజకవర్గంలోని టీడీపీ కూటమి అభ్యర్థుల గెలుపుకు తమవంతు కష్టపడి పని చేశారని సుజాత పార్టీ అధ్యక్షుని దృష్టికి తీసుక వెళ్లారు. కూటమి శ్రేణులకు టీడీపీకూటమి ప్రభుత్వం అండగా వుంటుందని భరోసా ఇచ్చారని సుజాత తెలిపారు.
