45 రోజుల క్రితం తాళ్లూరు తహసీల్దార్ బదిలీపై వచ్చిన పి.సింగారావు తన రాజకీయపలుకుబడితో అకస్మాత్తుగా బాపట్ల జిల్లాకు బదిలీపై వెళ్లారు. తహసీల్దార్ గా వచ్చినప్పటి నుండి సిబ్బందిని ఇబ్బంది పెటుతుండటంతో బదీలీల నెపంతో కొందరు సిబ్బంది బదిలీలకు అవకాశం లేకున్నా సరే .. ఇతరప్రాంతాలకు బదిలీ పెట్టుకున్నారు. తహసీల్దార్ పనితీరుతో ఇబ్బందులు తప్పవని తెలుసుకున్న విఆర్వోలు, కార్యాలయ సిబ్బంది ఇతరప్రాంతాల నుండి తాళ్లూరు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. తనకు గల రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని గుట్టుచప్పుడు కాకుండా బాపట్ల జిల్లాకు తహసీల్దార్ బదిలీ పై వెళ్లారు. ఆయనఉన్న సమయంలో ప్రజలకు రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాలేదనే ప్రజల నుండి ఆరోపణలు ఉన్నాయి. నెలన్నర రోజులుగా తహసీల్దార్ కార్యాలయంలో ఒక్కపని కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయన స్థానంలో నెల్లూరు జిల్లానుండి తహసీల్దార్ కె.నాగ లక్ష్మీ తాళ్లూరు నియమించారు. ప్రస్తుతం కార్యాలయంలో సిబ్బంది కొరతగా వున్నందున అధికారపార్టీనేతలు సిబ్బందిని నియమించి ప్రజలకు కష్టాలులేకుండా చూడాలని కోరుతున్నారు.
తహశీల్దార్ రాను వచ్చాడు …ఫోను పోయాడు …. ఆయన దెబ్బకు తట్టుకోలేక అవసరం లేకున్నా బదిలీపై వెళ్లిన సిబ్బంది – నేడు తాళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత
27
Sep