టూరిజం డవలప్ మెంట్ కార్పోరేషన్ (టిడిసీ) చైర్మన్ గా ఎన్నికైన టిడిపి పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజికి తాళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ అభిమానులు పూల మాలలువ వేసి బొకేలు ఇచ్చి ఘనంగా సన్మానించారు. రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ పెద కాలేషా వలి (బడే), బీసీ సంఘనాయకుడు సుబ్బారావు, యూత్ నాయకుడు యాతం శ్రీనివాస రెడ్డి, పలువురు అభిమానులు వేరువేరుగా అధిక సంఖ్యలో వెళ్లి అభినందనలు తెలిపారు.

