గిరిజన, ఆదివాసీ బిడ్డలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్ పనిచేస్తుంది-కమీషన్ సభ్యులు జాతోతు హుస్సేన్-ఒంగోలులో పర్యటన

జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్ సభ్యులు జాతోతు హుస్సేన్ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలు, చింతల గ్రామాల మధ్య గల నక్కల కాలనీని సందర్శించి నివాసం ఉంటున్న నక్కలవాసులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ..మాకు 2008 సంవత్సరంలో 55 కుటుంబాలకు పట్టాలు ఇవ్వడం జరిగిందే కానీ మాకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని, మేము షెడ్లు వేసుకొని జీవనం సాగిస్తుంటే, కొద్ది పాటి వర్షం కురిసినా మా నివాసాలకు 4,5 అడుగుల మేర వర్షం నీరు వచ్చి చేరడంతో మేము ఈ ప్రాంతంలో జీవనం సాగించడం కష్టంగా ఉండి ఒంగోలు నగరంలో వీధుల వెంబడి మా జీవనం సాగిస్తున్నామని, వర్షం నీరు రాకుండా రివిట్మెంట్ కట్టి భూమి లేవలింగ్ చేసి మాకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నక్కల వాసులు కమీషన్ సభ్యులు దృష్టికి తీసుకురావడం రావడం జరిగింది. అలాగే మాకు వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా కమీషన్ సభ్యులు జాతోతు హుస్సేన్ స్పందిస్తూ, ఎన్ని కుటుంబాలు వున్నాయి, వారికి రావల్సిన సంక్షేమ పథకాలు, వారు కోరుతున్న అభ్యర్థనలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి రెండు రోజుల్లో సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా సభ్యులు జాతోతు హుస్సేన్ మాట్లాడుతూ …మీరుకూడా మీ జీవన శైలి మార్చుకోవడంతో పాటు మీ పిల్లలను స్కూల్ కు పంపాలని, కష్టించి పనిచేసేలా మారాలని, మీరు పని చేస్తామని ముందుకు వస్తే ఒంగోలు పురపాలక సంఘం పరిధిలో పారిశుద్ధ్య కార్మికులుగా పని కల్పించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని నక్కల వాసులకు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన, ఆదివాసీ బిడ్డలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్ పనిచేస్తున్నదని, ఈ నక్కల వాసుల సమస్యలను తెలుసుకోవడం కోసం ఈ రోజు ఇక్కడకు రావడం జరిగిందన్నారు. 55 కుటుంబాలకు పట్టాలు ఇవ్వడం జరిగిందే కానీ, వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని, అలాగే సుమారు 20 మంది పిల్లలు ఉన్నారని, వీరు బడికి వెళ్ళకుండా వున్నారని, మాకు వితంతు, వృద్ధాప్య పింఛన్లు ఇవ్వలేదని వీరు తెల్పడం జరిగిందని, వీరి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డిఓ సుబ్బారెడ్డి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వేంకటేశ్వర రావు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జగన్నాథ రావు, బిజెపి అధ్యక్షుడు పీవీ శివారెడ్డి, ఒంగోలు, కొత్త పట్నం తహసీల్దార్లు, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *