మాజీ ఎంపీపీ కోట రామిరెడ్డి సేవలు మరువలేని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. తాళ్లూరులో ఎంపీపీ కోట రామిరెడ్డి శనివారం సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బా రెడ్డి, పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, మాజీ ఎంపీపీలు పోశం మధుసూధన రెడ్డి, గోళ్లపాటి మోషే, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, పులి బ్రహ్మా రెడ్డి, సర్పంచి చిమటా సుబ్బారావు, ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్, సొసైటీ అధ్యక్షుడు జయరామిరెడ్డి, నాగి రెడ్డి, ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్, టి. శంకర్ రెడ్డి, బ్రహ్మా రెడ్డి, యలమందా రావు తదితరులు పాల్గొన్నారు.
