గిరిజనుల జీవన ప్రమాణాలు మెరువుపడేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్, అధికారులను ఆదేశించారు.
శనివారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తో కలసి, వివిధ శాఖల జిల్లా అధికారులులతో సమావేశమై గిరిజనుల అభివృద్ధి కోసం వివిధ శాఖల ద్వారా అమలు జరుగుచున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షించి, పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ మాట్లాడుతూ, గిరిజనుల జీవన ప్రమాణాలు మెరువుపడేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమానికి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో గిరిజన కుటుంబాలకు అందేలా పటిష్టంగా అమలు చేయాలన్నారు. గ్రామ, మండల స్థాయిలో వివిధ శాఖల అధికారులపై అనేక పిర్యాదులు వస్తున్నాయని, సంబంధిత జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన స్థితిగతులను, వారి ఆర్ధిక పరిస్థితులను అర్ధం చేసుకొని ఆ వర్గాల ప్రజలకు న్యాయం చేయుటలో అధికారులు శ్రద్ద తీసుకోవాలన్నారు. ప్రకాశం జిల్లా లోని పశ్చిమ ప్రాంతంలోని చెంచు గూడెంలలో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ…. జిల్లాలో జన్ మన్ కార్యక్రమం కింద చెంచుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి గ్రామ సభలు నిర్వహించి అర్హత కల్గిన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్స్ మంజూరు చేయుటకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని, ముఖ్యంగా అర్హత కల్గిన దళిత, గిరిజన కుటుంబాలకు పెన్షన్ మంజూరుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. మీ కోసం కార్యక్రమంలో మరియు ఈ సమావేశంలో గిరిజన ప్రజలు ప్రస్తావించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో పలువురు జిల్లా ఎస్ సి., ఎస్టి విజిలెన్స్ కమిటీ సభ్యులు, పలువురు గిరిజన ప్రజలు వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ, ఎస్ సి., ఎస్టి అట్రాసిటీ కేసులకు సంబంధించి బాధిత కుటుంబాలకు పరిహారం రావల్సి ఉందని, అలాగే ఎస్.సి., ఎస్.టి బోగస్ కుల దృవీకరణ సర్టిఫికేట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందివున్నారని, వారి పై చర్యలు తీసుకోవాలని, అలాగే పలువురు భూ సమస్యలను జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్ సభ్యులు దృష్టికి తీసుకువచ్చారు. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్ సభ్యులు శ్రీ జాటోత్ హుస్సేన్ స్పందిస్తూ, ఈ సమావేశంలో ప్రస్తావించిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావు, ఒంగోలు ఆర్డిఓ సుబ్బా రెడ్డి, ఐటిడిఏ పిఓ సురేష్ కుమార్, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జగన్నాథ రావు, సాంఘీక సంక్షేమ శాఖ డిడి లక్ష్మా నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు.




