అత్యంతగా ప్రసిద్ది చెందిన పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతూ భక్తుల కోర్కెలు తీరుస్తున్న సోమవరప్పాడు పరిధిలోని గుంటిగంగ సన్నిధిలోగల గుంటి గంగాభవానీ తల్లికి ఆదివారం ప్రత్యేక పూజలునిర్వహించారు. దూరప్రాంతాల నుండి వచ్చిన భక్తులు గంగమ్మతల్లికి పొంగళ్లు పెట్టి చల్లంగా కరు ణించమని వేడుకున్నారు. తాళ్లూరు పరిసర మండల గ్రామాలకు చెందిన భక్తులు అమ్మవారికిమొక్కులు తీర్చుకున్నారు. పలువురుభక్తులు అమ్మవారికి వాహ నదారులు వాహనపూజలు చేయించారు. కొందరుభక్తులు గంగమ్మ తల్లికి కానుక లు, విరాళాలుగా సమర్పించారు. ఆలయబ్రాహ్మణఅర్చకులుఎన్.కామేశ్వరశర్మ పూజారులు ప్రకాష్ పంతులు, బాలరాజులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో పి. కార్తిక్ ఆలయకమిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.
